విద్యార్థులను ఖాళీ చేసి పంపించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్

విద్యార్థులను ఖాళీ చేసి పంపించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్
విద్యార్థులను ఖాళీ చేసి పంపించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్

కరెంటు, తాగు నీటి కొరత ఉందని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థులను ఖాళీ చేసి పంపించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ రాష్ట్రంలో కరెంట్ కోతలు, తాగు నీటి కొరత ఉందని ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏముంటుంది. కాంగ్రెస్ పాలనలో వందేళ్ళ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చీకటి రోజు వచ్చాయి కరెంటు కొరత నీళ్ల కొరత ఉందని విద్యార్థులను పంపించిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదు. రాష్ట్రంలో కరెంటు కోతలు ఉన్నాయని కేసీఆర్ గారు నిలదీస్తే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు ఎగిరెగిరి పడుతున్నరు.

రాష్ట్రంలో కరెంటు కోతలే లేవని దబాయిస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నెలకొన్న పరిస్థితులకు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఏం సమాధానం చెబుతారు. కాంగ్రెస్ పాలనలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రతిష్ట మసక బారింది. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా..చీకటి రాజ్యమేనా? రైతులకు సాగునీరు అందించక, కరెంటు అందించక ఘోరంగా విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. అన్ని వర్గాల ప్రజలకు చుక్కలు చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు ఉస్మానియా విద్యార్థులను కూడా వదలలేదు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులను, ఉస్మానియాలో చదివే విద్యార్థులను వెళ్లగొట్టడం దారుణమైన చర్య. ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన ఉద్యోగ నోటిఫికెషన్స్ ఏవి ? అని విద్యార్థులు ప్రశ్నిస్తారని భయంతొ ప్రభుత్వ ప్రోత్స్తాహం తొ యూనివర్శిటీ ఈ హాస్టల్ ల మూసివేత నిర్ణయం తీసుకొంది . కాంగ్రెస్ ప్రభుత్వ వచ్చి ఏడాది లోపు 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పింది. 4 నెలలు అయినా ఒక్క ఉద్యొగం ఇవ్వలేదు.

ఇంకా పిజి 4 వ సెమిస్టర్ పరీక్షలు పూర్తి కాకుండనే సెలవుల ఎలా ఇస్తారు ? ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారి పట్ల, విద్యార్థుల పట్ల ఇంత కర్కశంగా వ్యవహరించడం దారుణం. కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో విద్యార్థులు తప్పక బుద్ధి చెబుతారు