రేవంత్ రెడ్డి తాజా నిర్ణయం తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి అల్లకల్లోలం సృష్టించనుంది

వంత్ రెడ్డి తాజా నిర్ణయం తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి అల్లకల్లోలం సృష్టించనుంది
వంత్ రెడ్డి తాజా నిర్ణయం తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి అల్లకల్లోలం సృష్టించనుంది

పిచ్చోడి చేతిలో రాయి
ఈ తుగ్లక్ పాలనలో తెలంగాణ!

జిల్లాల సంఖ్యను 17కు కుదించాలన్న రేవంత్ రెడ్డి తాజా నిర్ణయం తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి అల్లకల్లోలం సృష్టించనుంది.

తొలుత ఈ నిర్ణయం వల్ల భారీగా నష్టపోయేది ఉద్యోగార్ధులైన తెలంగాణ యువత. జిల్లాల పునర్విభజన వల్ల ఇప్పుడున్న జోనల్ వ్యవస్థ నిష్ఫలం అయ్యి మళ్లీ కొత్తగా కేంద్రం నుండి, రాష్ట్రపతి నుండి కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదముద్ర తీసుకోవాల్సి ఉంటుంది

ఈ అవకతవక నిర్ణయం వల్ల తీవ్రంగా నష్టపోయేవారు తెలంగాణ రైతాంగం. కొత్త జిల్లాల వల్ల సుమారు 30 టౌన్లలో భూముల ధరలు పెరిగి ఆర్థికంగా కొంత నిలదొక్కుకున్నరు తెలంగాణ రైతులు. ఇప్పుడు రేవంత్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో భూముల ధరలు దారుణంగా పడిపోయి మళ్లీ ఆర్థిక ఒడిదొడుకులకు లోనవుతారు.

కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల అనేక ఇబ్బందులకు గురయ్యే వారిలో మరో ప్రధాన వర్గం ప్రభుత్వ ఉద్యోగులు. ఇప్పటికే 33 జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపు జరిగి జిల్లా ఆఫీసుల్లో అందరూ కుదురుకున్నారు. ఇప్పుడు మళ్లీ కొన్ని లక్షల మంది ఉద్యోగులకు స్థానచలనం కలగనుంది