లోయలో పడ్డ బస్సు.. 23 మంది మృతి

లోయలో పడ్డ బస్సు.. 23 మంది మృతి
లోయలో పడ్డ బస్సు.. 23 మంది మృతి

లోయలో పడ్డ బస్సు.. 23 మంది మృతి
పెరూలో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 23 మంది చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు తయాబాంబా నుంచి లిమా వెళ్తుండగా, కుస్కా జిల్లాలోని రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. అతివేగం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది