రేవంత్ రెడ్డిలాగా అబద్ధాలు చెప్పి ఓట్లు అడగను: డా.ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

రేవంత్ రెడ్డిలాగా అబద్ధాలు చెప్పి ఓట్లు అడగను: డా.ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌
రేవంత్ రెడ్డిలాగా అబద్ధాలు చెప్పి ఓట్లు అడగను: డా.ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

రేవంత్ రెడ్డిలాగా అబద్ధాలు చెప్పి ఓట్లు అడగను: డా.ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

గురుకులాల కార్యదర్శిగా ఎంతోమంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాను

ఎంపీగా గెలిపిస్తే నాగర్ కర్నూల్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

అధికారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాగా అబద్ధాలు, మోసపూరిత హామీలు ఇచ్చి ఓట్లు అడగనని,నిజాలు మాత్రమే ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతానని నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ భారాస అభ్యర్థి డా.ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. సోమవారం వనపర్తి లోని లక్ష్మీ కృష్ణ గార్డెన్స్ లో మాదిగల రాజకీయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాదిగల ఆత్మగౌరవ సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.గురుకులాల కార్యదర్శిగా కేసీఆర్ ప్రోత్సాహంతో ఎంతోమంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు ఎదిగేలా తీర్చిదిద్దానని తెలిపారు.గురుకులాల్లో చదివిన విద్యార్థులు పైలట్లుగా, ఇంజనీర్లుగా, నౌకలు నడిపే కెప్టెన్లుగా తయారు చేశానని తెలిపారు.డా.బి.ఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు అనే వజ్రాయుధంతో పేదల బతుకులు మార్చాలనే దృఢ సంకల్పంతో  రాజకీయాల్లోకి ప్రవేశించానన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి ద్యేయంగా నిస్వార్ధంగా సేవ చేస్తానని హామీ ఇచ్చారు.

బిజెపి కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే, రాజ్యాంగం రద్దవుతుందని అన్నారు. రాజ్యాంగం పేదల బతుకులు చీకటి యుగంలోకి వెళ్తాయన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై అత్యాచారాలు,దాడులు,హత్యలు అధికమయ్యాయని అన్నారు.ఎస్సీ వర్గీకరణ చేస్తానని బిజెపి హామీ ఇస్తే  ఎమ్మార్పీఎస్ నాయకులు బిజెపికి మద్దతిస్తున్నారు.కానీ దళితులపై వివక్ష చూపుతున్న పార్టీ బిజెపినేనని అన్నారు. మణిపూర్ లో మహిళలపై దాడి చేసి నగ్నంగా ఊరేగించిన చరిత్ర బీజేపిదని విమర్శించారు.

మాదిగల ఆత్మీయ సభ ఏ కులానికి కూడా వ్యతిరేకం కాదన్న ఆయన మాదిగలంతా రాజకీయంగా ఏకమై రాజ్యాధికారం సాధించే దిశగా అడుగులు వేసి, చట్టసభల్లోకి అడిగిడాలని కోరారు.తనను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంత సమస్యలపై పార్లమెంటులో గలం విప్పి, దశాబ్దాలుగా నెలకొన్న  అన్ని సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు.

స్థానికేతరుడు మల్లు రవిని ఓడించాలి:మాజీ మంత్రి సింగిరెడ్డి

నాగర్ కర్నూల్ ప్రాంతంలో స్థానికేతరులు ఎంపీగా పోటీ చేస్తే ప్రజలు గెలిపించారని అన్నారు. ఖమ్మంకు చెందిన మల్లు అనంత రాములు, మల్లు రవిని రెండు సార్లు ఎంపీగా,నంది ఎల్లయ్యను ప్రజలు గెలిపించారని  గుర్తు చేశారు. స్థానికుడు తుంగభద్ర, కృష్ణా నదుల మధ్య ఇసుకలో అక్షరాలు దిద్దిన విద్యావంతుడు, పేద ప్రజల కోసం ఉన్నత ఉద్యోగాన్ని వదిలిన ప్రవీణ్ కుమార్ ను కుల, మతలకు అతీతంగా ఎంపీగా గెలిపించాలని కోరారు.

ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తిని పార్లమెంట్ కు పంపితే పార్లమెంటుకే గౌరవం పెరుగుతుందన్నారు.కాంగ్రెస్ పాలనలో రైతులకు రైతుబంధు రావడంలేదని అన్నారు. సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోయి, కరెంటు కష్టాలు మొదలయ్య అని విమర్శించారు. మాదిగలంతా ఏకగ్రీవంగా కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.

ప్రవీణ్ కుమార్ ను గెలిపించాలి: మాజీ ఎంపీ రాల చంద్రశేఖర్ రెడ్డి

గురుకులాలను దేశంలో ఎక్కడా లేని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించి లక్షలాదిమంది ఉన్నతంగా తీర్చిదిద్దిన వ్యక్తి ప్రవీణ్ కుమార్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరుపై ఉందని  అన్నారు. ఆయన ఎంపీగా గెలిస్తే ఈ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి హామీ కల్పిస్తారని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ వద్దకు హామీలుగా మిగిలాయి తప్ప, ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే భారాసకు ఓటు వేయాలని కోరారు.ఈ సందర్భంగా పలువురు బీఎస్పీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సభలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ రంగినేని అభిలాష్ రావు, మాదిగ ఐక్య వేదిక నాయకులు నాయకులు మంగి విజయ్,గోవర్ధన్, గాయకుడు గిద్దె రామనరసయ్య తదితరులు పాల్గొన్నారు.