మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్ల కు వినతి పత్రం అందజేసిన ఐక్యవేదిక

మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్ల కు వినతి పత్రం అందజేసిన ఐక్యవేదిక
మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్ల కు వినతి పత్రం అందజేసిన ఐక్యవేదిక

స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే జయ రాములు గారి విగ్రహ ఏర్పాటుకు కౌన్సిల్ తీర్మానం చేయాలని, మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్ల కు వినతి పత్రం అందజేసిన ఐక్యవేదిక.

ఈ రోజు వనపర్తి మున్సిపాలిటీ లో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిల్ సభ్యుల సమక్షంలో అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు సతీష్ యాదవ్, ఎస్సీ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు, సిపిఐ కార్యదర్శి రమేష్, టిడిపి నాయకులు కొత్త గొల్ల శంకర్, నాయకులు శివకుమార్ తదితరులు ఈనెల 24 మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ మూలముల్ల జయరాములు గారి వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, దానికి సంబంధించిన తీర్మానాలు చేయాలని కోరడం జరిగింది. దానికి స్పందించిన చైర్మన్ వైస్ చైర్మన్ ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉందని, దాని తర్వాత ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారిని సంప్రదించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని తెలియజేయడంతో వారికి ధన్యవాదాలు తెలిపిన అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు.

ఈ సందర్భంగా అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ గతంలో కౌన్సిల్ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఈ విషయమై అప్పటి చైర్మన్ కౌన్సిల్ సభ్యుల సమక్షంలోనే వినతిపత్రం ఇవ్వడం జరిగిందని వారు దానికి స్పందించలేదని ,
ఇప్పటివరకు స్వర్గీయ జయరాములు గారి విగ్రహం నిర్మాణనికి తీర్మానం చేయకపోగా వారి పేరు మీద ఉన్న పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ లాక్కొని, ఆ పేరు తొలగించి ఆఫీసు భవనానికి తీసుకున్నారని ఇలాంటి చర్యల వలన ప్రజలకు నాయకులు దూరమవుతారని వెంటనే మూలమల్ల జయరాములు గారి స్మారకార్థం నిర్మించిన పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ ను పునరుద్ధరించి వనపర్తి ప్రజలకు, ప్రజా సంఘాలకు సౌకర్యం కల్పించాలని కోరారు.
స్థానిక ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి గారిని మరియు జిల్లా కలెక్టర్ గారిని, ఎన్నికల కోడ్ తర్వాత సంప్రదించి జయ రాములు గారి స్మారక గెస్ట్ హౌస్ ను పునరుద్ధరించి, వారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.