మార్నింగ్ వాక్ లో గడప గడపకు వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారి ఎన్నికల ప్రచారం

మార్నింగ్ వాక్ లో గడప గడపకు వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారి ఎన్నికల ప్రచారం
మార్నింగ్ వాక్ లో గడప గడపకు వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారి ఎన్నికల ప్రచారం

వనపర్తి జిల్లా కేంద్రంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ ప్రచారంలో భాగంగా వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో 18 వ వార్డు జమ్మి చెట్టు 21 వ వార్డు హరిజనవాడ కర్రెమ్మ గుడి మీదగా మంగళవారం 5 వ రోజు మార్నింగ్ వాక్ లో వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారు మాట్లాడుతూ

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకు ప్రచారం చేస్తుంటే మహిళలు నుదుటున తిలకం దిద్ది హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు పెద్దపీట వేయడం మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రేషన్ షాపుల్లో తొమ్మిది సరుకులు ఇచ్చాము
1, సన్న బియ్యం

2, కందిపప్పు

3, కిరోసిన్

4, చింతపండు

5, గోధుమపిండి,

6 మంచి నూనె

7, చక్కెర

8, గోధుమలు

9, మినపప్పు

ఇచ్చాము బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సన్న బియ్యం మాత్రం ఇచ్చారు కావున బిజెపి బీఆర్ఎస్ పార్టీలు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి పేద కుటుంబాలకు కూడా ఏం చేయలేదు కావున ప్రజలారా మళ్లీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయని మీ ఇండ్ల దగ్గరికి బిజెపి బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాయ మాటలు చెప్పడానికి వస్తున్నారు తస్మాత్ జాగ్రత్త

21వ వార్డులో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘాగారు అంబలి తాగడం జరిగింది కార్యకర్తలకు నాయకులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అంబలి పోయడం జరిగింది

21వ వార్డులో గడప గడప ప్రచారంలో భాగంగా వనపర్తి ఎమ్మెల్యే గౌరవ తూడి మేఘా రెడ్డి గారికి వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్ గారు శాలువా కప్పి సన్మానం చేయడం జరిగింది

ఈ మార్నింగ్ వాక్ లో వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త వనపర్తి పట్టణ అధ్యక్షులు వనపర్తి మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్స్ కో ఆప్షన్ నెంబర్స్ మాజీ కౌన్సిలర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళ మత్స్యకార సోషల్ మీడియా యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ సేవాదళ్ అన్ని వార్డుల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది