మల్దకల్ మండల కేంద్రంలో స్థానిక రైతు వేదిక సమావేశము

మల్దకల్ మండల కేంద్రంలో స్థానిక రైతు వేదిక సమావేశము
మల్దకల్ మండల కేంద్రంలో స్థానిక రైతు వేదిక సమావేశము

తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ -TVVU ఆధ్వర్యంలో మల్దకల్ మండల కేంద్రంలో స్థానిక రైతు వేదిక సమావేశపు హాల్ నందు ” వ్యవసాయ కూలీలు, రైతులు , విత్తన కంపెనీ ఏజెంట్లతో జిల్లాస్థాయి సమాలోచన సమావేశం ” నిర్వహించడం జరిగింది
యూనియన్ ప్రతినిధులు.

గద్వాల జిల్లా యూనియన్ కార్యదర్శి శ్రీ జి నర్సింలు గారి అధ్యక్షతన జరిగిన
ఈ సమావేశము లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టగాళ్ళ వెంకటయ్య , సంయుక్త కార్యదర్శి బి నాగన్న ,మహిళా కార్యదర్శి డి వెంకటేశ్వరమ్మ మరియు ఎం శ్రీనివాసులు మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి, డి స్వాతి వికారాబాద్ జిల్లా కార్యదర్శి , అల్లంపూర్ నియోజకవర్గం కార్యదర్శి హెచ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

వ్యవసాయ కూలీలు రైతులు గట్టు, మల్దకల్, ఐజ , ఉండవెల్లి, ఇటిక్యాల , మానవపాడు మండలాల నుండి వ్యవసాయ కూలీలు రైతులు సీడీ ఏజెంట్లు 50 మంది పాల్గొనడం జరిగినది.

సమావేశం ముఖ్య ఉద్దేశం:
తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ ఆధ్వర్యంలో వ్యవసాయ రంగంలో 3. సర్వేలు నిర్వహించడం జరిగినది 1. వ్యవసాయ కూలీల వేతనాల గూర్చి.

2. వ్యవసాయకు కూలీల ఆర్థిక , సామాజిక స్థితిగతుల గూర్చి 3. విత్తన ఉత్పత్తి రైతుల పెట్టుబడులు , దిగుబడులు , అప్పులు ఆదాయాల.
పై తెలిపిన సర్వేల్లో వెలువడినటువంటి అంశాలపై సమాలోచన సమావేశం నిర్వహించడం జరిగినది.

సర్వేల ద్వారా వెలువడిన అంశాలు :
* విత్తన క్షేత్రాల్లో పనిచేసే కూలీలకు కనీస వేతనాల కంటే తక్కువ వేతనాలు ఇస్తున్నారు.
* మహిళలకు మరీ తక్కువగా చెల్లిస్తున్నారు
* వేతనాలు చెల్లిస్తున్నప్పుడు కార్మికులతో పాటు ఎవ్వరికి ఎలాంటి సంబంధం లేదు.
* అప్పులు ఎక్కువగా తీసుకోవడం వల్ల రుణభారం పెరిగి వెట్టిచాకిరి వ్యవస్థకు దారితీస్తుంది.
* విత్తన క్షేత్రాల్లో ఎలాంటి చట్టబద్ధత లేదు
* కనీస వేతనాల గూర్చి కార్మికులకు అవగాహన లేదు.
* పకృతి వైపరీత్యాల వల్ల సంభవించే అనర్థాలకు రైతులు నష్టపోతున్నారు వాటికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వడం లేదు.
* రైతుల కు పెట్టుబడులు ఎక్కువ దిగుబడును తక్కువ.
* కూరగాయల విత్తనాలు ఉత్పత్తి రంగం లో కంపెనీకి నుండి రైతులకు నేరుగా సంబంధాలు ఉంటే లావాదాయకంగా ఉండేది కానీ మీడియేటర్ ఉండడంవల్ల రైతులు నష్టపోతున్నారు అనేపల్లి విషయాలు గుర్తించడం జరిగినది. ఈ అంశాల పైన సమావేశంలో డిబేట్ చేయడం జరిగినది ఈ యొక్క సమావేశము సాయంత్రం మూడు గంటలకు ముగిసినది.