దత్తాత్రేయ స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న మాజీ పార్లమెంట్ సభ్యులు

దత్తాత్రేయ స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న మాజీ పార్లమెంట్ సభ్యులు
దత్తాత్రేయ స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న మాజీ పార్లమెంట్ సభ్యులు

దత్తాత్రేయ స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న మాజీ పార్లమెంట్ సభ్యులు, వనపర్తి మాజీ ఎమ్మెల్యే గౌరవ శ్రీ రావుల చంద్రశేఖరరెడ్డి గారు.
వనపర్తి నియోజకవర్గం సోలిపూర్ గ్రామములో గత పదిరోజులుగా జరుగుతున్న దత్తాత్రేయ స్వామి బ్రహ్మోత్సవాలలో చివరిరోజు సందర్బంగా మాజీ పార్లమెంట్ సభ్యులు, వనపర్తి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖరరెడ్డి గారు స్వామివారిని దర్శించుకున్నారు.ఆలయ మర్యాదలతో అర్చకులు, కమిటీ సభ్యులు, గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు.అనంతరం బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయడానికి కృషి చేసిన కమిటీ సభ్యులను,ఆలయ ప్రధాన అర్చకులు,ఆలయ నిర్మాణ దాత జోషి గోపాలశర్మ గారిని రావుల చంద్రశేఖరరెడ్డి గారు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ పద్మశ్రీ బాలీశ్వర్ రెడ్డి,అనిల్ కుమార్ రెడ్డి,పురెందర్ రెడ్డి,
నందిమల్ల.అశోక్,బాలయ్య,బాలస్వామి,అమరేందర్, తదితరులు పాల్గొన్నారు.