తెలంగాణ కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు

తెలంగాణ కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు
తెలంగాణ కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు

ఆసిఫాబాద్ జనజాతర బహిరంగ సభలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొమురంభీం ఆసిపాబాద్ జిల్లాలో బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీపై అనేక ఆరోపణలు చేశారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు ఆదిలాబాద్ సమస్యలను వినిపించేందుకు ఆదివాసీ ఆడబిడ్డకు కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందన్నారు. ఆసిఫాబాద్‎కు ఒక ప్రత్యేకత ఉందని.. ఆసిఫాబాద్ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో ఆ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తుందని చరిత్రను గుర్తు చేశారు.

BJPకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారన్నారు రేవంత్‌. రిజర్వేషన్లపై ప్రశ్నించినందుకే తనపై కేసు పెట్టారన్నారు. ఢిల్లీ పోలీసులను పంపి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని, ఇలాంటి కేసులకు తాను భయపడనన్నారు. గతంతో తనపై 200 వందల కేసులు పెట్టి చంచలగూడ, చర్లపల్లి జైలుకు పంపారని గతాన్ని గుర్తు చేశారు. అయినా తాను ఎక్కడా వెనకడుగు వేయలేదని ఆసిఫాబాద్ జనజాతర బహిరంగ సభలో ప్రజలకు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.