డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళల అభివృద్ధి కేవలం విద్య ద్వారానే సాధ్యమవుతుందని

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళల అభివృద్ధి కేవలం విద్య ద్వారానే సాధ్యమవుతుందని
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళల అభివృద్ధి కేవలం విద్య ద్వారానే సాధ్యమవుతుందని

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళల అభివృద్ధి కేవలం విద్య ద్వారానే సాధ్యమవుతుందని చెప్పిన మహనీయుడు. మహిళలకు విద్య మరియు సమానత్వం కోసం సమాజంలో పురుషులతో సమానమైన అధికారిక హక్కులు కల్పించారు. అంబేద్కర్ న్యాయ మంత్రిగా ఉన్న కాలంలో హిందూ కోడ్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు, ఇది మహిళలను భారతదేశంలో సమాన పౌరులుగా చట్టబద్ధంగా గుర్తించటానికి అనుమతించింది.

మహిళలకు వారసత్వ హక్కు మరియు చట్టపరమైన గుర్తింపు ఇవ్వబడింది. అంబేద్కర్ మహిళలకు రాజ్యాంగ హామీలు కల్పించడమే కాకుండా, సమాజంలో మహిళల స్థానాన్ని బలోపేతం చేసే చట్టాలను రూపొందించారు. అంబేద్కర్ గారు మహిళా సాధికారత కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన గొప్ప నాయకుడు.