టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించాలని టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారం

టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించాలని టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారం
టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించాలని టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారం

30/4/2024 వ రోజు వనపర్తి పట్టణం 7వ వార్డు పీర్లగుట్ట నందు టిఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించాలని టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గడపగడప తిరిగి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నేతృత్వంలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి సహకారంతో వనపర్తి పట్టణానికి జరిగిన అభివృద్ధి పనుల గురించి వివరించారు, పీర్లగుట్ట లోని డబల్ బెడ్ రూమ్ లు, పీర్ల గుట్ట పైకి మంచినీళ్ల వసతి, సీసీ రోడ్లు, కరెంటు స్తంభాలు, ఇంకా ఎన్నో అభివృద్ధి పనుల వివరాలను తెలిపారు, టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పేదింటిలో పుట్టి ఎదిగి దేశానికి సేవలు అందించాడు తెలంగాణ ఉద్యమకారులకు అండగా నిలిచాడు గురుకులాల సెక్రటరీగా పనిచేసి లక్షలాదిమంది విద్యార్థుల తలరాతలు మార్చాడు, తన ఉద్యోగాన్ని వదిలి బహుజనుల కోసం రాజకీయాల్లోకి వచ్చాడు

కావున నిస్వార్థపరుడైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన కారు గుర్తు గల ప్రవీణ్ కుమార్ గారికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్ తో పాటు పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి గంధం పరం జ్యోతి, ఆ వార్డు టిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి నందిమల్ల రవి, కౌన్సిలర్లు బండారు కృష్ణ, పెండెం నాగన్న యాదవ్,పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు నీలస్వామి, ఉంగ్లం తిరుమల్, యువత అధ్యక్షులు సూర్యవంశం గిరి డి,దానియేలు, ప్రేమ్ నాథ్ రెడ్డి మాధవి సూర్యవంశం రామస్వామి ఇంతియాజ్ మైనార్టీ అధ్యక్షులు జోయబ్, తోట బాలరాజు, తోట శ్రీను,తదితరులు పాల్గొని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ సార్ ని గెలిపించాలని ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరిగింది