గడ్డివాము బాధితుడుని పరామర్శించిన ఎమ్మెల్యే

గడ్డివాము బాధితుడుని పరామర్శించిన ఎమ్మెల్యే
గడ్డివాము బాధితుడుని పరామర్శించిన ఎమ్మెల్యే

వనపర్తి నియోజకవర్గంలో వనపర్తి పట్టణం నాలుగవ వార్డు నర్సింగాయపల్లికి చెందిన కుమ్మరి నాగన్న తన గేదెల కోసం సమకూర్చుకున్న ఏడు ట్రాక్టర్ల వరిగడ్డి వాముకు ఈనెల 27వ తేదీన నిప్పంటుకొని పూర్తిగా కాలిపోయింది.

30 గేదెలను పెంచుకుంటూ తద్వారా వచ్చే పాడిని విక్రయిస్తూ జీవనోపాధి కొనసాగించే ఆ కుటుంబం గేదెల కోసం సమకూర్చుకున్న గడ్డి పూర్తిగా కాలిపోవడంతో మూగజీవాలకు ఆహారం ఏర్పాటు చేయలేక నానా యాతన పడుతున్నారని తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ మేఘ రెడ్డి గారు సోమవారం బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు

ఈ సందర్భంగా ఆయన తక్షణ సహాయంగా గేదెలకు పశుగ్రాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక సహాయం చేశారు

ఉన్నతాధికారులతో మాట్లాడి మరింత పశుగ్రాసం వారికి అందేలా చూస్తానని భరోసా కల్పించారు

ఎమ్మెల్యే ఇచ్చిన భరోసా కు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్ నియోజకవర్గ అసెంబ్లీ సమన్వయకర్త లక్కాకుల సతీష్, బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు ముంబై మన్నెంకొండ, శేఖర్ రెడ్డి, నందిమల్ల చంద్రమౌళి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు