కె.సి.ఆర్ గారివల్లనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు.

కె.సి.ఆర్ గారివల్లనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు.
కె.సి.ఆర్ గారివల్లనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు.

ప్రవీణ్ కుమార్ గారికి మద్దతు ఇచ్చి కె.సి.ఆర్ గారికి అండగా ఉండాలి. గౌరవ మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి గారు..ఈరోజు పెద్దమందడి మండల కేంద్రంలో *గౌరవ, మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మార్నింగ్ వాక్ చేస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రజలను కలుసుకొని కె.సి.ఆర్ బలపరిచిన అభ్యర్థి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.

కాంగ్రెస్ మోసపూరిత హామీలు నమ్మి కె.సి.ఆర్ గారిని దూరం చేసుకున్నామని అందుకు నేడు సంక్షేమం,వ్యవసాయం మూలనపడిందని అన్నారు.
గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను రైతు ఋణ మాఫీ,రైతు బంధు,రైతు భీమా,ధాన్యం కొనుగోలుపై బోనస్,మహిళలకు 2500,గ్యాస్ సబ్సిడీ,కళ్యాణ లక్మితో తొలం బంగారం,గ్యాస్ సబ్సిడీ,యువతకు ఉద్యోగావకాశాలు,నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించాలని అన్నారు.
అనంతరం ఉపాధి హామీ కూలీలను కలుసుకొని కాంగ్రెస్ పార్టీని తెచ్చుకొని కరువు తెచ్చుకున్నామని మళ్ళీ వలసల బాట పట్టారు అని అన్నారు.
మహిళలు మాట్లాడుతూ కాంగ్రెస్ మాటలకు మోసపోయామని ఈ సారి కె.సి.ఆర్ గారిని గెలిపిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల సమన్వయ కర్త లక్షమా రెడ్డి,పార్టీ z.p.t.c రఘుపతి రెడ్డి,పార్టీ అధ్యక్షులు వేణు,సేనాపతి తదితరులు పాల్గొన్నారు.