కీర్తిశేషులు గంధం బాలరాజు అకాల మరణం టిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు

కీర్తిశేషులు గంధం బాలరాజు అకాల మరణం టిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు
కీర్తిశేషులు గంధం బాలరాజు అకాల మరణం టిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు

వనపర్తి పట్టణం హరిజనవాడ 21 వ వార్డు టిఆర్ఎస్ పార్టీ వార్డు కార్యదర్శి గంధం బాలరాజు మరణం తీరనిలోటని ఆ వార్డులోని పార్టీకి చేసిన సేవ మరువలేమన కొనియాడారు.

కీర్తిశేషులు గంధం బాలరాజు మరణ వార్త తెలిసిన వెంటనే టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రివర్యులు
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు బాలరాజు మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి , కుటుంబాన్ని ఓదారుస్తూ ధైర్యంగా ఉండాలని, పార్టీకి పనిచేసిన ప్రతి కార్యకర్తను పేరుపేరున గుర్తించుకుంటామని అన్నారు అంత్యక్రియల నిమిత్తం కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది భవిష్యత్తులో కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి,టిఆర్ఎస్ పార్టీ అవార్డు ఇంచార్జి గంధం విజయకుమార్ 21 వ వార్డు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డి, తిరుపతయ్య, ఫజల్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి చిట్యాల రాము,ఈరపోగు మన్యం అవార్డు ప్రజలు పాల్గొన్నారు