కారు గుర్తుకే ఓటేద్దాం బీఆర్ఎస్ పార్టీ నే గెలిపిద్దాం

కారు గుర్తుకే ఓటేద్దాం బీఆర్ఎస్ పార్టీ నే గెలిపిద్దాం
కారు గుర్తుకే ఓటేద్దాం బీఆర్ఎస్ పార్టీ నే గెలిపిద్దాం

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ గారి గెలుపు మద్దతుకై మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీ మరియు పలు కాలనీలలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆరెకపూడి గాంధీ గారు, మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి ఇంటిటి ప్రచారం చేసిన మియాపూర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ గారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ గారు, కార్పొరేటర్ శ్రీకాంత్ గారు మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ గారి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని, కాసాని ని అఖండ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ గారికి కానుకగా ఇద్దాం అని,తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తుందని,ఈ సారి కూడా పార్టీ అభ్యర్థిని గెలిపించి కేసీఆర్ గారికి కానుకగా ఇస్తామన్నారు.పార్టీ రెండు సార్లు అవకాశం ఇచ్చిన ఇద్దరు నేతలు ఇప్పుడు ఇతర పార్టీల నుండి పోటీ చేస్తున్నారని ఆ ఇద్దరిని ఓడించటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటుందని,కేసీఆర్ గారిని ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలను ఏ ఒక్క గ్యారెంటీ అమలు చేయలేదని ప్రజలకు వివరిస్తూ, మోసం చేసే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని, ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటూ, కాపాడుకుంటూ వచ్చిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ అని, బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిత్యవసర సరుకులు, గ్యాస్ ధరలను పెంచి సామాన్యుల బ్రతుకులపై గుది బండగా మారిందని, మత రాజకీయాలు చేసి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పా ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు అని అన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం అని, గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి హయాంలో రాష్ట్రంలోని పేదలకు అందిన ప్రభుత్వ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీ కి శ్రీరామ రక్ష అని, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధి ,సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతున్నమని, కాసాని జ్ఞానేశ్వర్ గారు అత్యధిక భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయం అని ఈ విజయం ను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారికి కానుకగా ఇస్తామని ఎమ్మెల్యే గాంధీ గారు, కార్పొరేటర్ శ్రీకాంత్ గారు తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, బస్తి కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేయోభిలాషులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.