కాంగ్రెస్ పార్టీలో చేరిన మద్దెల బండ గ్రామస్తులు

కాంగ్రెస్ పార్టీలో చేరిన మద్దెల బండ గ్రామస్తుల
కాంగ్రెస్ పార్టీలో చేరిన మద్దెల బండ గ్రామస్తుల

కాంగ్రెస్ పార్టీలో చేరిన మద్దెల బండ గ్రామస్తులు కాంగ్రెస్ నాయకుడు శేషంపల్లి నరసింహులు అధ్వర్యంలో చేరిక

మల్దకల్ మే6 మల్దకల్ మండలం పరిధిలోని మద్దెలబండ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు 100 మంది కార్యకర్తలు జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత తిరుపతయ్య సమక్షంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ప్రతి గ్రామం నుండి చేరికలు ఉంటాయని ఆయన తెలిపారు. ఇప్పటికే అనేక గ్రామాల నుండి కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల నాటికి మల్దకల్ మండలం మొత్తం ఖాళీ అవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శేషంపల్లి నర్సింహులు,మాజీ ఎంపిటిసి అమరవాయి కృష్ణారెడ్డి,మధుసూదన్ బాబు, రాజశేఖరరెడ్డి,లత్తిపురం వెంకట్రామిరెడ్డి,పెదొడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.