కాంగ్రెస్ పార్టీలో చేరిన తాటికుంట గ్రామస్థులు

కాంగ్రెస్ పార్టీలో చేరిన తాటికుంట గ్రామస్థులు
కాంగ్రెస్ పార్టీలో చేరిన తాటికుంట గ్రామస్థులు

ఎం.పి అభ్యర్థి మల్లు రవి,జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు….

గద్వాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మల్దకల్ మండలం తాటికుంట గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత తిరుపతయ్య అధ్వర్యంలో నాగర్‌కర్నూల్ పార్లమెంటు అభ్యర్థి ఎం.పి అభ్యర్థి మల్లు రవి సమక్షంలో మల్దకల్ గౌడ్, కుర్వ బుడ్డన్న,భీమన్న, నర్సింహులు, రామన్న లతో పాటు 100 మంది కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు….హస్తం పార్టీ తోనే మార్పు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు… మహాలక్ష్మి పథకం క్రింద ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు ప్రతి ఏడాది 1 లక్ష రూపాయల సహాయం తదితర సంక్షేమ పథకాలతో అభివృద్ధి జరుగుతుందని పార్టీ మారినట్లు తెలిపారు…

ఈ కార్యక్రమంలో మాజీ కన్సమర్ ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, సీనియర్ నాయకులు అమరావాయి కృష్ణారెడ్డి, పెద్దపల్లి రాజశేఖర్ రెడ్డి,సత్యనారాయణ, లత్తిపురం వెంకట్రామిరెడ్డి, కృష్ణమూర్తి,శేషంపల్లి నర్సింహులు,తాటికుంట సర్పంచ్ ఆంజనేయులు,పెదొడ్డి రామకృష్ణ,ఉప సర్పంచ్ వీరేష్ గౌడ్, భానుప్రకాశ్ రెడ్డి, సోమన్న,భాస్కర్, నారాయణ, నర్సింహులు తదితరులు ఉన్నారు.