కాంగ్రెస్ పార్టీకే మాలల మద్దతు మాల ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ జి చెన్నయ్య

కాంగ్రెస్ పార్టీకే మాలల మద్దతు మాల ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ జి చెన్నయ్య
కాంగ్రెస్ పార్టీకే మాలల మద్దతు మాల ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ జి చెన్నయ్య

కాంగ్రెస్ పార్టీకే మాలల మద్దతు
మాల ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ జి చెన్నయ్య
దళితుల అభ్యున్నతికి సాధికారత కోసం గతంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో కృషి చేసిందని ప్రస్తుతం రాష్ట్రంతో పాటు దేశంలో అధికారంలో ఉంటే దళిత బలహీన వర్గాలకు మరింత మేలు జరిగే అవకాశం ఉన్నదని అందుకే కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు మాల ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ జి చెన్నయ్య పేర్కొన్నారు.

గురువారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోవిలేకరుల సమావేశంలో మాల ప్రజా సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్లు బూర్గుల వెంకటేశ్వర్లు గోపోజు రమేష్ మన్నె శ్రీధర్ రావు లతో కలిసి చెన్నయ్య మాట్లాడుతూ గతంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం తెచ్చి చట్టబద్ధత చేయడం ఆహార భద్రత చట్టం భూ పంపిణీ బ్యాంకుల జాతీయకరణ పబ్లిక్ రంగ సంస్థల ఏర్పాటు ఇలాంటి చట్టాల ద్వారా దళిత గిరిజన బలహీన వర్గాల బహుముఖ అభివృద్ధికి పాటుపడింది కాంగ్రెస్ పార్టీ అని చెన్నయ్య తెలిపారు.

ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి కేవలం కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ వారికి దేశ సంపదను దోచిపెడుతుందని దేశంలో బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చివేసి ఎస్సి, ఎస్టీ బీసీల రిజర్వేషన్లు తొలగించే ప్రమాదం ఉందని అంబేద్కర్ వాదులను అణిచివేయడానికి బిజెపి తెలంగాణలో కంటోన్మెంట్ అసెంబ్లీతో సహా మూడు పార్లమెంటు రిజర్వ్ స్థానాలలో ఒక్కటి కూడా మాలలకు కేటాయించలేదని ఆయన పేర్కొన్నారు.

టిఆర్ఎస్ పదేళ్ల పాలనలో దళితులను కెసిఆర్ వంచించారని దళిత బంధు మూడెకరాల భూమి లాంటి పథకాలను దళితులకు ఇస్తున్నట్లు ప్రచారం చేసి మాపై సమాజం అంతా అసూయ పడేలా చేసి రాష్ట్ర సంపదను వందల ఎకరాలు ఉన్న దొరలకు వారి కుటుంబ సభ్యులకు దోచిపెట్టారని ఎస్సీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారని సబ్ ప్లాన్ నిధులను దారి మళ్ళించారని చెన్నయ్య ఆరోపించారు
దళిత బహుజనులు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అభివృద్ధి నిరోధకులైన బిజెపి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓడించాలని చెన్నయ్య దళిత బహుజనులకు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో మాల ప్రజాసంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్లు బూర్గుల వెంకటేశ్వర్లు గోపోజు రమేష్ మన్నె శ్రీదర్ రావు, మాల మహానాడు గ్రేటర్ అధ్యక్షులు బైండ్ల శ్రీనివాస్ మాల మహానాడు నాయకులు కనకం ఎల్లస్వామి, చేపూరి శంకర్,కమల్ కుమార్,ఒగ్గు అనిల్ కుమార్,తదితరులు పాల్గొన్నారు