కందనూలును మళ్లీ కాంగ్రెస్ కబంధ హస్తాలకు అప్పగిద్దామా ?

కందనూలును మళ్లీ కాంగ్రెస్ కబంధ హస్తాలకు అప్పగిద్దామా ?
కందనూలును మళ్లీ కాంగ్రెస్ కబంధ హస్తాలకు అప్పగిద్దామా ?

కందనూలును మళ్లీ కాంగ్రెస్ కబంధ హస్తాలకు అప్పగిద్దామా ?

స్థానికుడు, విద్యాధికుడైన మాజీ ఐపీఎస్ ఆర్ఎస్పీ వైపా ? స్థానికేతరుడైన మల్లు రవి వైపా ? మీరు ఎవరివైపు ?

రెండు సార్లు ఎంపీ అయినా వీసమెత్తు అభివృద్ది చేయని మల్లు రవి వైపా ?

తెలంగాణ కోసం 2008 లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన సమయంలో తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మంత్రి చెర్నకోల లక్ష్మారెడ్డి మీద పోటీ చేసి ఓడించి తెలంగాణ ఏర్పాటు జాప్యానికి కారణం అయిన తెలంగాణ ద్రోహి మల్లు రవి.

కందనూలుకు మల్లు రవి చేసిన మచ్చలు చెరిపేస్తే చెరుగుతుంది ?

దివంగత కల్వకుర్తి ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మూలంగా ఒకసారి ఎంపీగా గెలిచి ఆయనకు వ్యతిరేకంగా గ్రూపులు కట్టింది నిజం కాదా ?

ఎంపీగా ఎన్నికై ప్రతి నియోజకవర్గంలో అభివృద్దిని పట్టించికోకుండా గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించే మల్లు రవితో మనకు ఒనగూరే ప్రయోజనాలేంటి ?

కేసీఆర్ కుటుంబాన్ని కుటుంబపాలన అనే మల్లు రవి వారసత్వంగానే రాజకీయాల్లోకి వచ్చింది నిజం కాదా ?

మల్లు భట్టి విక్రమార్కకు ఉప ముఖ్యమంత్రి పదవి, ఆయన సోదరుడికి లోక్ సభ టికెట్ .. ఏ సేవలు చేశారని వీరిని ఆదరించాలి ?

ప్రజల ఓట్లతో రెండు సార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే అయిన మల్లు రవి ఈ పని నావల్లే సాధ్యం అయింది అని చెప్పుకునే పని ఉందా ?

ఖమ్మం జిల్లాకు చెందిన మల్లు రవి మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయహోదా కోసం పోరాడతాడా ?

రేపు కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలని , రైతులకు సాగు నీళ్లు ఇవ్వాలని పోరాడతాడా ?

కృష్ణానదిలో తెలంగాణ వాటా నీళ్లు తేల్చాలని కేంద్రాన్ని నిలదీస్తాడా ?

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తికాకుండా కేసులు వేసి రెండేళ్లు ఆలస్యానికి కారణం అయిన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మన రైతలన్నల బతుకులు బాగుపడతాయా ?

మల్లు రవి గెలిస్తే మనకు ముల్లు గర్రగా మారడం ఖాయం.

పదవికోసం ఆరాటపడుతున్న మల్లు రవిని గెలిపిద్దామా ? ఈ ప్రాంతం, ఈ ప్రాంత బిడ్డల భవిష్యత్ కోసం ఆరాటపడే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపిద్దామా ?

అధికారం వచ్చిన నాలుగు నెలలకే అహంకారం తలకెక్కి విర్రవీగుతున్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో బుద్దిచెప్పాలి.

పాలమూరు గొంతు పార్లమెంట్ లో ప్రతిధ్వనించాలి, మన హక్కుల కోసం నినదించాలి అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఆశీర్వదించాలి.

🚗 కారు గుర్తుకు ఓటెయ్యండి.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఆశీర్వదించండి.

పాలమూరు గొంతుకను గెలిపించండి.