ఐజ గద్వాల్ 8 గంటల బస్సు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు

ఐజ గద్వాల్ 8 గంటల బస్సు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు
ఐజ గద్వాల్ 8 గంటల బస్సు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు

మల్దకల్ మండలం  జోగులాంబ గద్వాల జిల్లా బుధవారం ఐజ గద్వాల్ రాత్రి ఎనిమిది గంటలకు వెళ్లాల్సిన బస్సు అర్ధాంతరంగా రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆర్టీసీ అధికారులు ముందస్తుగా బస్సును రద్దు చేస్తున్నామని సమాచారం లేకుండా ఎప్పుడు బడితే అప్పుడు బస్సులను రద్దు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. 8 గంటల బస్సు కోసం ఎందరో ప్రయాణికులు,ఉద్యోగులు ఎదురుచూస్తూ ఉంటారు.కానీ ఆర్టీసీ అధికారులు బస్సును రద్దు చేయడంతో ప్రయాణికుల కోసం వేరే ఆల్టర్నేటివ్గా బస్సును ఏర్పాటు చేయాల్సి ఉండగా తమకేమీ పట్టినట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అధికారులు ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందు సమాచారం ఇచ్చి బస్సులను రద్దు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.