ఎన్నికల ప్రచారంలో పర్యటనలో ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు,ఎంపీ అభ్యర్థి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు

ఎన్నికల ప్రచారంలో పర్యటనలో ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు,ఎంపీ అభ్యర్థి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు
ఎన్నికల ప్రచారంలో పర్యటనలో ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు,ఎంపీ అభ్యర్థి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు

రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ అందించిన ఘనత కెసిఆర్ గారి దే

ఆరు గ్యారెంటీల లను వారంటీ లేని పథకం మాత్రమే

గెలవక ముందు మాయమాటలు గెలిచాక ఢిల్లీ బాటలు ఇది కాంగ్రెస్ పార్టీ తీరు

కాంగ్రెస్ పార్టీ నాయకులు మాటల తప్ప చేతలు లేని పనులు

అన్ని కుల మతాలను అభివృద్ధి కోసం చేస్తున్న నాయకుడు కేసీఆర్ గారు

కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దు

కారు గుర్తుకు ఓటు వేద్దాం. గద్వాల ను మరింత అభివృద్ధి చేసుకుందాం….

నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి నీ గెలిపిద్దాం కేసిఆర్ గారికి కానుకగా ఇద్దాం…

ఈరోజు గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రములో నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో పర్యటనలో ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు , ఎంపీ అభ్యర్థి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు హాజరయ్యారు .

మహిళలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారికి ఎంపీ అభ్యర్థి గారికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రజాప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు గజమాలతో ఘనంగా సత్కరించారు .

 

ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ….

పదేళ్లలో కెసిఆర్ గారి పాలనలో తెలంగాణ రాష్ట్రం తో పాటు ప్రతి గ్రామాలు అభివృద్ధి చెందడం జరిగింది. గ్రామాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే గ్రామంలో సరైన సదుపాయాలు లేక ప్రజలు ఎన్నో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి ప్రస్తుతం గ్రామాలలో మనకు కనిపిస్తుంది రైతులకు కూడా సరైన సమయంలో నీళ్లు లేక కరెంటు లేక ఏదో ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేదు మళ్లీ ఎంపీ ఎన్నికల్లో ప్రజలకు మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ మీ ముందుకు వస్తున్నారు కావున వారికి తగిన బుద్ధి చెప్పాలంటే పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

 

ఎంపీ అభ్యర్థి గారు మాట్లాడుతూ….

నేను కూడా నడిగడ్డ వాసిని బహుజన బిడ్డని టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందడం జరిగింది. కెసిఆర్ గారి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడం జరిగింది. నేను కేసీఆర్ గారి సహకారంతో గురుకుల పాఠశాలలో ఎన్నో ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుని తీర్చడం జరిగింది. అదేవిధంగా నన్ను నాగర్కర్నూల్ అభ్యర్థిగా గెలిపిస్తే ఢిల్లీలో మీ తరఫున ప్రశ్నించే గొంతునవుతాను అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థుల భవిష్యత్తును తీర్చే విధంగా నా వంతు కృషి చేస్తానని తెలిపారు.

త్వరలోనే జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో మే 13వ తేదీ నాడు కారు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగర్ దొడ్డి వెంకట రాములు, జిల్లా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి పటేల్ ప్రభాకర్ రెడ్డి, జెడ్పీటీసీ పద్మ వెంకటేశ్వర్ రెడ్డి వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లు డి.ఆర్ విజయ్, ఉరుకుందు, రామకృష్ణారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, వెంకటరామిరెడ్డి, సత్యం రెడ్డి, చక్రధర్ రావు, రఘువర్ధన్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, డి.వై రామన్న, ఈశ్వరయ్య, రంగస్వామి, శ్రీరాములు, రాఘవేందర్ రెడ్డి, భీమ్ రెడ్డి, హనుమంతు రెడ్డి, భగీరథ వంశీ, కురుమన్న,అంజి సాగర్, మల్లికార్జున్ రెడ్డి, అంబ్రహం , నాసిర్, పురుషోత్తం రెడ్డి భరత్ సింహా రెడ్డి, సంజీవ్, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ‌.