ఆగారం గ్రామాన్ని ఆదర్శంగా మార్చుకుందాం

ఆగారం గ్రామాన్ని ఆదర్శంగా మార్చుకుందాం
ఆగారం గ్రామాన్ని ఆదర్శంగా మార్చుకుందాం

Mp అభ్యర్థి మల్లు రవి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి

కాంగ్రెస్ పార్టీ చేరికలు కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

ఖిల్లా ఘనపురం మండలం ఆగారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చుకుందామని వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘా రెడ్డి గారు పేర్కొన్నారు

ఆదివారం ఖిల్లా ఘనపురం మండలం ఆగారం గ్రామంలో చేపట్టిన చేరికలు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు

ఈ సందర్భంగా ఆగారం గ్రామానికి చెందిన 80 మంది గ్రామ నాయకులు రవికుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు

వీరికి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పదేళ్ల BRS పాలనలో గ్రామం ఎటువంటి అభివృద్ధి సాధించలేదని నేడు ఇందిరమ్మ రాజ్యంలో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని ఆగారం గ్రామాన్ని తాను దత్తత తీసుకున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు

15 రోజుల్లో రానున్న ఎంపీ ఎన్నికల్లో ఆగారం గ్రామం నుంచి భారీ మెజారిటీ రావాలని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లూరవి గారిని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన సూచించారు

ఈ కార్యక్రమంలో మండల నాయకులు సాయిచరణ్ రెడ్డి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జయకర్, గ్రామ కమిటీ అధ్యక్షులు కృష్ణయ్య, మాజీ సర్పంచ్ తెలుగు బాలయ్య మాజీ ఉప సర్పంచ్ నరేష్, మానాజీపేట్ మాజీ సర్పంచ్ సతీష్, గ్రామ నాయకులు రవికుమార్ శ్యామసుందర్రావు, కాజ మైనుద్దీన్, సాయిబాబు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు